సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం నెల్లూరు సెంట్రల్ జైలు లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. తదుపరి జగన్ మీడియాతో మాట్లాడుతూ.. 4 సార్లు ప్రజా అభిమానంతో మాచర్ల నుండి ఎమ్మెల్యే గా ఎన్నికయిన పిన్నెల్లి ని అనేక అక్రమ కేసులు పట్టి అరెస్ట్ చెయ్యడం ఆఖరికి హత్య యత్నం కేసు కూడా పెట్టారని, ఇది ఒక్కటి మాత్రమే కాదని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై ఆస్తుల ధ్వసం, దాడులు చేసి గాయపరచడం, వై యస్ విగ్రహాలను అగ్ని కి ఆహుతి చెయ్యడం , తమ టీడీపీ కి ఓట్లు వెయ్యనివారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం .. లోకేష్ మొదలు ప్రతి గ్రామం లో ఇదే రెడ్ బుక్ కేసులు అరాచక పర్వము చేస్తున్నారని, దీనికి ప్రజలు అసహ్యించుకొంటున్నారని జగన్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు జాతి మతం, పార్టీ చూడలేదని.. ప్రజలు అర్హత చూసి సంక్షేమ ఫలాలను వారి ఇంటికే ఇచ్చామని, ఎన్నికలలో చంద్రబాబు మాయ వాగ్దానాలకు కేవలం 10 శాతం మంది ప్రజలు మోసపోయారు తప్ప 40 శాతం మంది వైసీపీ వైపు ఉన్నారని కూటమి నేతలు గమనించాలని అన్నారు. ఎన్నికలలో హామీలు అమలు పర్చలేక,రైతులకు భరోసా డబ్బు ఇవ్వలేక, మహిళలకు నెలకు 1500, పిల్లలందరికీ అమ్మవడి ఇవ్వలేక ప్రజలు దృష్టి మరచడానికి వైసీపీ ఆఫీసులపై దాడులు కూడా చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివి వెంటనే ఆపాలన్నారు. లెక్క జమచేసి ప్రజలు.. చంద్రబాబుకు గట్టిగా జవాబిచ్చే రోజులు తొందర్లోనే ఉన్నాయి. శిశుపాలుడి లా తప్పులు చేస్తూ పొతే ఇక చూస్తూ ఊరుకొనే ప్రసక్తి లేదు.. దీనికి కారకులయిన వారిని వదిలే ప్రసక్తి లేదు. చంద్రబాబు ఏ విత్తు నాటితే అదే తరహా ఫలాలు మీకు ఇస్తాను.. అన్ని ఆపాలి.. ఇది విన్నతి కాదు .. నా హెచ్చరిక అంటూ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
