సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్’ ప్రభాస్ ను పాన్ ఇండియా సూపర్ స్టార్ గా కల్కి 2898 A D మరోసారి రుజువు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 8 రోజులకు 770 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించగా వచ్చే ఆదివారం రోజుకల్లా.. అంటే 11 రోజులలో 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. పాన్ వరల్డ్ స్టార్ గా హాలీవుడ్ సినిమాకు సైతం పోటీగా విదేశాలలో కల్కి సినిమా రికార్డు కలెక్షన్స్ వసూళ్లు తో ప్రభాస్ వీర విహారం చేస్తున్నాడు.. ఇక అతనిని స్వస్థలం భీమవరంలో కలెక్షన్స్ ప్రభంజనం మాములుగా లేదు. నిన్న గురువారంతో కేవలం 8 రోజులకు 1కోటి 80 లక్షల రూపాయలు కలెక్షన్ అధిగమించింది. రేపు శనివారంతో పట్టణంలో 2 కోట్ల రూపాయలు కలెక్షన్స్ అధిగమించే అవకాశం స్వష్టంగా ఉంది. నిన్న గురువారం స్కూల్స్ బంద్ కావడంతో కల్కి ఏకంగా 6 థియేటర్స్ లో ప్రదర్శించిన అన్ని ఆటలు హౌస్ ఫుల్ కావడం గమనార్హం.. గతంలో భీమవరం లో ఉన్న బాహుబలి 2 సినిమా 3 కోట్ల 65లక్షల సినిమా రికార్డు కలెక్షన్స్ ను కల్కి తో మరోసారి ప్రభాస్ సమీపించే అవకాశం స్వష్టంగా కనపడుతుంది. సినిమా రిలీజ్ అయ్యి రేపటితో 10 రోజులు పూర్తీ అయిన నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి ప్రకారం ఆదివారం నుండి టికెట్స్ రేట్లు తగ్గిస్తారా? లేదా మరో 4 రోజులు పెంచిన ధరలకే టికెట్స్ విక్రయిస్తారా ?అన్నది ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *