సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో అతి పెద్ద చర్చి గా ప్రసిద్ధి పొందిన భీమవరం రూపాంతర దేవాలయంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ను నేడు, ఆదివారం స్థానిక పాస్టర్లు, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రెమల్లి కమల్ రాజు ఆధ్వర్యంలో ప్రభువుకు ప్రత్యేక ప్రార్ధనలు అనంతరం ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. మీ ఆదరణ ఆప్యాయత ఎప్పటికీ మరవలేనని, ఈ గెలుపు మీదేనని అన్నారు. భీమవరం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, అందరికీ ఎల్లపుడూ అందుబాటులోనే ఉంటానని అన్నారు. కార్యక్రమంలో పీసీసీ చైర్మన్ ఉన్నమట్ల కరుణాకర్, పాస్టర్ నక్కా అశోక్ కుమార్, వి ఉదయ్ కుమార్, చిన్నం కమల్ హాసన్, వెంకటరత్నం, సోడదాసీ రూబీన్, ఎద్దు ఏసుపాదం, సోడదాసి మోహన్, దొడ్డిగర్ల తులసి వెంకట కృష్ణారావు, తదితరులతో పాటు జనసేన పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్, ఎఎంసి మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, చల్లా రాము పాల్గొన్నారు.
