సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ప్రతిష్టాకర ‘దంతులూరి నారాయణరాజు ఇంజనీరింగ్ కళాశాల కు ‘యూపీసీ’ వారిచే స్వతంత్ర ప్రతిపత్తి కల కళాశాలగా “అటానమస్ ” హోదాకు ఆమోదం లభించిందని డి ఎన్ ఆర్ కళాశాల అసోసియేషన్ అధ్యక్షులు, గోకరాజు వెంకట నర్శింహరాజు తెలియజేసారు. నేటి శనివారం జరిగిన మీడియా సమావేశంలో.. కళాశాల పాలకవర్గ వక్తలు మాట్లాడుతూ..అత్యుత్తమ విద్య ను అందించే నిష్ణాతులు అయిన అధ్యాపకులతో పాటు కళాశాలలో ఆధునిక వసతులుతో ప్రఖ్యతా కంపెనీల లో విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ అందిస్తున్న DNR ఇంజనీరింగ్ కళాశాలకు గత ఏడాది కేంద్ర సంస్థ నాక్ వారి A++ గ్రేడు సాధించింది. తాజగా ఇప్పుడు అటానమస్ హోదా రావటంతో ఇంజనీరింగ్ కాలేజిలో ఇకపై స్వతంత్రంగా వివిధరకాల ప్రోగ్రామ్స్ ను కొత్త కోర్పులను రూపొందించుకుని ప్రవేశ పెట్టుకోవచ్చు. పాత కోర్సులను పునః సమీక్ష చేసి తగు రీతిన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చును. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్న పత్రాల మూల్యాంకన చేసుకొనే సదుపాయం, అకడమిక్ ప్లాన్స్ ప్రవేశపెట్టనికి పూర్తీ స్వేచ్ఛ ఉంటుందని , ఇకపై మరింత ఉన్నతంగా ఇంజనీరింగ్ అభివృద్ధి కి కృషి చేస్తామని అన్నారు. యూనివర్సిటీల నిబంధనలకు అనుగుణంగా అనుగుణంగా కొన్ని ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు,. కళాశాలకు UGC వారి అటానముస్ హోదా వచ్చినందున కళాశాలలు పని చేస్తున్న అధ్యాపక సిబ్బందికి వివిధ ప్రభుత్వ సంస్థల ఆర్థిక సహాయంతో అనేకా ప్రాజెక్టులను చేపట్టుటకు అవకాశంవుంది. ఈ కార్యక్రమంలో పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు, సంయుక్త కార్యదర్శి కె.రామకృష్ణంరాజు, అసిస్టెంట్ సెక్రటరీ కె.శివరామరాజు, ట్రెజరర్ ,కె.వి.యస్.నారాయణ పాలకవర్గ సభ్యులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *