సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏ పీలో మొత్తం 37 మంది ఐపీఎస్ (IPS) పోలీస్ అధికారులను నేడు, శనివారం సాయంత్రం చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తాజగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓఆర్టీ నంబర్ 1252 జారీ చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అజిత వేజెండ్ల, మరియు ఏలూరు జిల్లాల ఎస్పీ మేరీ ప్రశాంతి లు కూడా బదిలీ అయ్యారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఆద్నాన్ నయీం అస్మీ పశ్చిమ గోదావరి జిల్లాకు మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ASPగా ఉన్న ప్రతాప్ శివకిషోర్ ఏలూరు ఎస్పీగా నియమితులయ్యారు.
