సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోక్ సభలో బీజేపీ స్వంతం బలం 240 సీట్లకే పరిమితం కావడంతో ఎన్డీయే కూటమిలోని మిగతా పార్టీల అండదండలతో కేంద్రం లో 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ కు తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ కి బలం మరింత తగ్గిపోయింది. గతంలో బీజేపీ నామినేటెడ్ ఎంపీలైన నలుగురు, రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జఠ్మలాని పదవికాలం గత శనివారంతో ముగియడంతో పెద్దల సభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. రాష్ట్రపతి ఏ బిల్లు పాస్ కావాలన్నా లోక్ సభ తో పాటు రాజ్యసభ లో పెద్దల ఆమోదం పొందవలసి ఉన్న తరుణంలో మొత్తం 245 రాజ్యసభ ఎంపీలకు గాను పదవి విరమణ తరువాత 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో 225 మంది ఉన్నారు. ప్రస్తుతం సమావేశాలకు సిద్ధం అవుతున్న రాజ్యసభలో ప్రభుత్వ బిల్ పాస్ కావాలంటే ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్ 113 సీట్లు కావలసి ఉంది. అయితే బీజేపీ తో సహా ఎన్డీయేకు 12 సీట్లు తక్కువ అయ్యాయి. ప్రస్తుత సంఖ్యా బలం 101గా ఉంది. ఇటీవల ఎన్డీయేలో చేరిన టీడీపీ, జనసేన కు రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేడు. వారికీ మరో 2 ఏళ్ళు వరకు సభ్యుడు వచ్చే అవకాశం లేదు. అయితే జగన్ ఆద్వర్యంలోని 11 మంది వైసీపీ బలం ఇప్పుడు ఎన్డీయే కు అతికీలకం ఈ కీలక సమయంలో జగన్, తమ వైపే ఉంటారని బీజేపీ పెద్దలు ధీమాగా ఉన్నారు. వైసీపీ బలానికి తోడు మరో ఇద్దరు రాజ్యసభఎంపీలు తోడయితే ఎన్డీయే ప్రభుత్వం రాజ్యసభలో గట్టెక్కుతుంది. తమిళనాడులోని అన్నాడీఎంకే 4 గురు రాజ్యసభ సభ్యుల బలం సహకరిస్తే వీలవుతుంది. ఒకవేళ వైసీపీ’ కనుక ఇండియా కూటమి తో కలిస్తే రాజ్యసభలో ఎన్డీయే కు ఇబ్బందులు తప్పవు.. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వం లోని ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. ఒరిస్సా లోని బిజూ జనతాదళ్ కు 9 మంది సభ్యులు ఉన్నారు. వీరు బీజేపీ కి వ్యతిరేకం.ఈ కీలక సమయంలో లోక్ సభలో 4గురు ఎంపీలు. రాజసభలో 11 మంది ఎంపీల బలం తో వైసీపీ వేసే అడుగులు దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. మరి ఈ అవకాశాన్ని జగన్ ఎంత సమర్ధవంతంగా వాడుకొంటాడో చూడాలి.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్..
