సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ఎమ్మెల్యే నేడు, ఉండి రోడ్డుపై ఉన్న అక్రమ ఆక్రమణలతో గత 5 ఏళ్ల క్రితం మూతపడిన పార్కును గతవారం సందర్శించి ప్రజలకు ఆహ్లదం కలిగించే విధంగా శుభ్రపరిచి, పిల్లలకు జారుడుబల్ల, ఉయ్యాలలు, వినోద సామాగ్రి తో పునరుద్ధరణ పనులను చెప్పట్టాలని అధికారులను ఆదేశించారు. దానితో పార్క్ పునః ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే రఘురామా నేడు,సోమవారం ను పార్క్ ను సందర్శించి అక్కడి ఏర్పాట్లు కు తోడు మరో 5 వారాలలోపు పిల్లల గేమ్‌లు మరియు బ్యాడ్మింటన్ కోర్ట్‌తో వాకింగ్ ట్రాక్‌తో పార్క్‌ని మరింత ఆధునికంగా పునర్నిర్మించడానికి స్థానిక దాతల మద్దతుతో కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. దానికి తగిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎమెల్య రఘురామా నేడు, ఉండి మార్కెట్ యార్డ్ లో జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొని తన గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ, బీజేపీ వారితో పాటు జనసైనికులకు తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో ఉండి నియోజకవర్గ అభివృద్ధి కి జనసేన తమ పాత్ర పోషించాలన్నారు. భీమవరం లో ఇస్కాన్ వారి శ్రీ జగన్నాధ రధ యాత్రలో కూడా ఎమ్మెల్యే రఘురామా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *