సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం కేంద్ర బడ్జెట్ సందర్భంగా దేశీయ సూచీలు తీవ్ర హెచ్చు తగ్గులుతో ఇన్వెస్టర్ లను కంగారు పెట్టాయి. రోజుంతా లాభ నష్టాలతో దోబూచులాడాయి. ఒక దశలో 1300 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ లాభాలపై పన్నును పెంచడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ లాభాలపై పన్నును పెంచడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. వివిధ రంగాలకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగకపోవడంతో మదుపర్లు నిరాశపడ్డారు. నేటి మంగళవారం ఉదయం లాభలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటి తర్వాత నష్టాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్ స్వల్ప నష్టంతో రోజును ముగించింది. దాదాపు 200 పాయింట్ల నష్టంతో 80, 724 వద్ద నేటి రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. 80, 766 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసి అక్కడి నుంచి ఏకంగా 1500 పాయింట్లకు పైగా కోల్పోయింది. 79, 224 వద్ద ఇంట్రాడే లో కి చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ కోలుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *