సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సామాన్య ప్రజలకు అందుబాటు ధరలలో పర్యావరణ అనుకూలమైన ప్రజా రవాణా వాహనాల ఎంపికలను అందించడంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ (EMPS)ని రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తాజగా ప్రకటించింది. ఈ పథకాన్ని ఈ ఏడాది మార్చిలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ పథకం రెండు నెలల పాటు పొడిగించడం అంటే సెప్టెంబరు 30, 2024 వరకు పొడిగించబడింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ, అభివృద్ధిని ప్రోత్సహించడం. ఈ పథకం కింద అర్హత కలిగిన EV కేటగిరీలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, రిజిస్టర్డ్ ఇ రిక్షాలు, ఇ కార్ట్‌లతో సహా మూడు చక్రాల వాహనాలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా ఇప్పుడు 500,080 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 60,709 ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు సహా 560,789 ఎలక్ట్రిక్ వాహనాల తయారు చేసే పరిశ్రమలకు మద్దతును అందించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకొంది
