సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఆర్యవైశ్య సంఘ ఆఫీసు నందు ది. 25-7-2024వ తేదీన టి.జి.వెంకటేష్ , ఎ.పి.ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, వెలగా శ్రీరామమూర్తి, భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ప్రెసిడెంట్, బొండాడ మోహనరావు(రాంపండు) గారి ఆశీస్సులతో పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు వోలేది వెంకట రాధాకృష్ణ, అధ్యక్షతన మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా యిన్నమూరి వెంకట శ్రీనివాస రావు(తెనాలి శ్రీను)ని, కార్యదర్శిగా రాజా బాలమస్తానయ్యని, కోశాధికారిగా చల్లగండ్ల నాగేశ్వరరావుని ప్రకటించి భీమవరం పలువురు వైశ్య ప్రముఖులు పెద్దల సమక్షంలో అధికారికముగా నియామక పత్రాలని అందించారు . ఈ సమావేశంలో వోలేటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. జిల్లా ఆర్యవైశ్య సమావేశాన్ని భీమవరంలో త్వరలో ఏర్పాటుచేసి ఆర్యవైశ్య సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడతామని సభాముఖంగా తెలిపారు.
