సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో టాప్ ఇంజినీరింగ్ కాలేజీలలో ఒకటైన భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి BBA కోర్స్ మంజూరు అయి నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి మురళీకృష్ణంరాజు తెలిపారు. ఈ మేరకు ఉన్నతి విద్యా మండల్ నుండి అనుమతి రావడంతోపాటు వెబ్ ఆప్షన్లో కూడా SRKR ని ఇంక్లూడ్ చేశారని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం, ఆర్ధిక రాజధాని భీమవరంలో.. ఇక ఫై మా ఇంజనీరింగ్ కళాశాలలో కూడా బిజినెస్ కోర్సులు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు విద్యారంగ నిపుణులనుండి వచ్చిన సూచనల మేరకు దీనినిఏర్పాటు చేసినట్లుచెప్పారు. మేనేజ్మెంట్ కోర్సులకు కూడా భవిష్యత్తు లో తమ కళాశాలలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలియజేసారు.
