సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఈ నెల చివరిలో జరగనున్న విశాఖ ఎమ్మెల్సీ యుద్ధానికి వైసీపీ సిద్ధమైంది. తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోడానికి మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ను బరిలోకి దింపుతోంది ఆ పార్టీ. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లో వైసీపీ విజయం సాధిస్తే కూటమి ప్రభుత్వానికి తొలి సవాల్ లో తన సత్తా నిరూపించుకొన్నట్లే .. దీనికి పార్టీ స్థానిక ప్రజా ప్రతినిదుల ఓట్ల తో పాటు ఆ ఓట్లను చంద్రబాబు ఆద్వర్యంలోని అధికార కూటమి పార్టీ ఆకర్షించకుండా అంగబలం అర్ధం బలం ఉన్న బొత్స సత్యనారాయణ మాత్రమే గెలుపు గుర్రంగా భావిస్తున్న జగన్ ఈసారి విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పంతం పట్టారు. ఈ నెల 30న జరిగే ఎన్నికకు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. వైసీపీ సిట్టింగ్ స్థానమైన విశాఖను కాపాడుకోడానికి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75 శాతం బలం ఉండగా, అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొందరు అధికార పార్టీ ఆకర్షణ తో వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా స్థానిక సంస్థల శాసనమండలి ఓటర్లే. ఐతే ఇది బొత్య దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చతురత కు ఉత్తరాంధ్ర లో ఆయన పట్టుకు కూడా పరీక్ష ..
