సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో రేపటి సోమవారం నుండి ( ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు) నిర్వహించే తెలుగు భాషా దినోత్సవ వేడుకల బ్రోచర్ ను నేడు, ఆదివారం ఉదయం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఆవిష్కరించారు. తెలుగు భాష ఔన్నత్యం యుగాంతం వరకు చెరగని ముద్ర, తెలుగు భాషా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అమరావతి శాసనాల్లో తెలుగు లిపి ఉండటం గొప్ప విశేషమని, తెలుగు భాషోధ్యమ నాయకుల గిడుగు రామమూర్తి ధన్యజీవి అని, అటువంటి తెలుగు భాషా దినోత్సవ వేడుకలను నాలుగు రోజులపాటు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. నిర్వాహకులు రంగసాయి మాట్లాడుతూ… ఈనెల 26న కేజీఅర్ఎల్ కళాశాలలో ప్రారంభ సభ, 27,28 తేదీల్లో విద్యార్థులకు పోటీలు, 29న ముగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 24 మంది పండితులకు సత్కారం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో తెలుగు భాషాభివృద్ధి సంఘం నాయకులు కలిగొట్ల గోపాల శర్మ, టీడీపి నేతలు కోళ్ల నాగేశ్వరరావు, విజ్జురోతి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
