సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేతలతో టీడీపీ అధినేత ,ఏపీ సీఎం చంద్రబాబు నేడు, ఆదివారం సమావేశం నిర్వహించారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవం సాధించడమే లక్ష్యంగా టీటీడీపీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని ఇకపై రాష్ట్రంలో టీడీపీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పాత టీడీపీ పాత కమిటీలన్నీ రద్దు చేశారు. ఇకపై అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సభ్యత్వాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నేతలకు సూచించారు. సభ్యత్వాలను పెద్ద ఎత్తున నమోదు చేయించిన నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లవంటివని.. రెండు ప్రాంతాలు సమ అభివృద్ధి చెందాలనేదే టీడీపీ అభిమతమని పేర్కొన్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినా.. గ్రామాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు.. అయితే ఈ సమావేశంలో టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
