సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు అడ్జక్షతన . భీమవరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సమావేశంలో రామరాజు పార్టీ నేతలను క్యాడర్ నుద్దేశించి మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామరాజును పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, పార్టీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, శాలువాతో సత్కరించుకున్నారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. పట్టణంలోని 39 వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ద్వారా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ యాప్ ద్వారా సోషల్ మీడియా ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గంలో మొదటి ఆరు స్థానాల్లో స్థానం సాధించిన మరపట్ల శ్యాంబాబు, గాదిరాజు నారాయణరాజు, రేవు జనార్దన్, కడలి విజయ్కుమర్, బొమ్మిడి ధర్మరాజు, గాడిపల్లి సందీఫ్ కుమార్లకు చంద్రబాబు పంపించిన ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, కోళ్ల నాగేశ్వరరావు, వి.శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ఇందుకురి సుబ్రహ్మణ్యంరాజు, సీనియర్ నాయకులు మెరగాని నారాయణమ్మ, ఇందుకురి రామలింగరాజు, గనిరెడ్డి త్రినాద్, పామర్తి వెంకటరామయ్య, ఎద్దు ఏసుపాదం, ఐజాక్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
