సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ నేడు, బుధవారం కూడాలాభాల్లో ముగిసిం ది. ఇక నిఫ్టీ మరోసారి రికార్డు స్థాయిలో జివితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నేడు, బుధవారం 25,052 మార్కు ను క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ ఫలితాలతో నేటి ఉదయం మన మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైన.. అనంతరం క్రమక్రమం గా లాభాల్లోకి వచ్చే సింది. సెన్సెక్స్ 73 పాయిట్లు లాభపడి 81, 785 దగ్గర ముగియగా.. నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 25, 052 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.92 దగ్గర ముగిసింది. నిఫ్టీలో ఎల్‌టిఐఎం డ్‌ట్రీ, విప్రో, దివిస్ ల్యాబ్స్ , ఇండస్‌ఇండ్ బ్యాంక్ మరియు భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా లాభపడగా… మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ , అదానీ ఎంటర్‌ప్రైజెస్ మరియు బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *