సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారీగా వరద నీరు కొల్లేరులోకి , ఉపుటేరు లోకి చేరడంతో గత నాలుగు రోజులుగా వరదనీటి తో ఆకివీడు, కైకలూరు , కలిదిండి వరద నీరు తో భారీ పంట నష్టం వెలది ఎకరాల చేపల చెరువులు నిట మునిగిపోవడంతో చేసేది లేక రైతాంగం బాధ వర్ణనాతీతం.. ఇక కొల్లేరు లంక గ్రామాలను వరద చుట్టుముట్టడంతో రోడ్డులు మునిగిపోయి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పాటు వందలాది చేపల చెరువులు నీటమునిగాయి. కొల్లేరు సరస్సును ఆనుకుని ఉన్న చేపపిల్లల చెరువులు సుమారు 600 ఎకరాలకు పైగా నీటమునిగి లక్షల్లో రైతులు నష్టాన్ని చవిచూశారు. ప్రస్తుతము వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలతో మరింత వరదనీరు కొల్లేరులోకి చేరనున్న దృష్ట్యా గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.ఆలపాడులోని ఉప్పుటేరును ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామా కృష్ణంరాజు మరియు కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, పరిశీలించారు. గత 4 రోజులుగా కైకలూరు–ఏలూరు రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. గోకర్ణపురం నుంచి పైడిచింత పాడుకు వెళ్లే రహదారి పూర్తిగా ముంపునకు గురైంది. ఆయా గ్రామాల్లోని ప్రజలు పడవలపై రాకపోకలను సాగిస్తున్నారు. ఆలపాడు నుంచి కొల్లేటికోటకు వెళ్లే రహదారిలో రెండు చోట్ల గండ్లు పడి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ( ఫై చిత్రాలు ఆకివీడు దగ్గర ఉప్పుటేరు వరద కు సంబందించినవి)
