సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల విజయవాడలోని వరద పరిస్థితులు ప్రతి ఒక్కరిని కల్చివేశాయని .. అక్కడి వరద బాధితులుగా సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి తోచిన సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చిన ప్రతిఒక్కరూ అభినందనీయులని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. స్థానిక గునుపూడిలోని శ్రీఉమా సోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్య దాతల సహకారంతో నేడు, సోమవారం ఉదయం సుమారు రూ 3 లక్షల 50 వేలు విలువ కలిగిన 1100 (5 కేజీల బస్తాలు) బస్తాల బియ్యంను విజయవాడకు పంపించారు. ఎమ్మెల్యే అంజిబాబు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఇక బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు వేలూరి హనుమ కిరణ్, కార్యదర్శి మారెళ్ళ అఖిలేష్, చెరుకుపల్లి సంతోష్, బ్రహ్మజ్యోసుల సత్య ప్రసాద్ మాట్లాడుతూ 1100 కుటుంబాలకు సరిపడ బియ్యం సేకరించి అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, టీడీపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, కోళ్ల నాగేశ్వరరావు ,విజ్జురోతి రాఘవులు తదితర కూటమి నేతలు పాల్గొన్నారు.
