సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భీమవరం పట్టణ ప్రజల జీవితాలు కూడా అస్తవ్యస్తం అవుతుంది. పంటలు ఆక్వా చెరువులు దెబ్బతిన్నాయి. రోడ్లపై జనసంచారం లేదు. వ్యాపారాలు లేవు. ‘సందట్లో సడేమియా’ అంటూ కూరగాయలు నిత్యసర ధరలు బియ్యం ధరలు భారీగా పెరిగిపోయాయి.ధరల పెరుగుదలకు అన్నిటికి రవాణా చార్జీలు పెరిగాయని, కూరగాయలు లేవని, బియ్యం పంట ఈఏడాది లేదని వ్యాపారస్తులు సమాధానం చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారుల నిఘా లేకుండా పోయింది. ప్రధాన రహదారులు అన్ని చాల దారుణంగా దెబ్బ తిన్నాయి. రాళ్ళూ పైకి వచ్చేసి దారుణంగా తయారయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన రిపేర్ లు చెయ్యకపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉన్నంతలో స్థానిక మున్సిపాలిటీ పారిశుద్యం బాగానే నిర్వహిస్తుంది. నేడు, సోమవారం కూడా భారీ వర్షం పడుతూనే ఉంది. ఈనేపథ్యంలో నేడు, సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరగవలసిన మీకోసం – ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంను రద్దు చేసినట్లు, అలాగే జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రెవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించి కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. వాయుగుండం గాలులు వేగం పెరగటంతో భీమవరం, నరసాపురం సముద్ర తీరా ప్రాంతాలలో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్య కారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. పట్టణంలో శ్రీ వినాయక చవితి పందిళ్ళ లో సందడి తగ్గింది. పలు అపార్ట్మెంట్స్ లో 3 రోజులకే నిమజ్జనాలు చేసుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *