సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లాలో ఏలేరు వరదేరుగా మారింది. నాలుగేళ్ల తర్వాత ఉగ్రరూపం దాల్చింది. గత సోమవారం ఒక్కరోజే ఆ జిల్లాలోని ఏడు మండలాల్లో 22 వేల ఎకరాలకు పైగా ముంచేసింది. ఇళ్లనూ చుట్టేసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాదు నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి నేరుగా గొల్లప్రోలు జగనన్న కాలనీకి చేరుకున్నారు. అక్కడ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన, బీజేపీ ఇన్చార్జిలు మర్రెడ్డి శ్రీని వాసరావు, డాక్టర్ బుర్రా కృష్ణంరాజు, జిల్లా కలెక్టరు సగిలి షాన్మోహన్, ఎస్పీ విక్రాంత్పాటిల్తో కలిసి బోటులో జగనన్న కాలనీ సందర్శనకు బయలుదేరారు బురదలోనే నడుచుకుంటూ, బోటు ఎక్కి నీటముని గిన పేదల ఇళ్ల కాలనీకి వెళ్లారు.ఆదుకుంటామని బాధితుల కు భరోసా ఇచ్చారు.పవన్ మాట్లాడుతూ.. తాను అనారోగ్యంతో ఉన్నపటికీ హైదరాబాద్ నుండి బాధితుల కోసం వచ్చానని వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు బలైపోయారన్నారు. వరద ప్రాంతాల సందర్శన అనంత రం పవన్ అత్యవసర సమీక్ష కోసం మంగళగిరి వెళ్లారు. మరో పక్క వర్షాలతో అనేకచోట్ల రహదారులపై పదడు గుల ఎత్తులో నీరు ప్రవహిస్తుండడం తో రాకపోకలు నిలిచిపోయాయి. తుని-నర్సీపట్నం రోడ్డులో ఆర్టీసీ సర్వీసులు నిలిపివేసింది.
