సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కొల్లేరు , ఉప్పుటేరుల వరద తాకిడి కి మునిగిన ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు ప్రాంతంలో నేడు, బుధవారం స్థానిక ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు కలసి పర్యటించడానికి సీఎం చంద్రబాబు సిద్ధం అయినప్పటికీ ఆకివీడులో ఉప్పుటేరు పరిసర ప్రాంతాలలో హెలికాఫ్టర్ ల్యాండ్ అవడానికి తగిన అవకాశాలు లేకపోవడం తదితర అనివార్య కారణాలు వల్ల నేడు, బుధవారం జరగవల్సిన సీఎం చంద్రబాబు పర్యటన కేవలం ఏలూరు జిల్లా కు మాత్రమే పరిమితం చేసారు. ఏలూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు తో కలసి ఉండి ఎమ్మెల్యే రఘురామా కూడా పర్యటిస్తున్నారు. సీఎం కు ఉండి నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల ప్రజల సమస్యలతో పాటు రైతాంగానికి, ఆక్వా రైతాంగానికి జరిగిన నష్టాన్ని వివరించారు.ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నేటి ఉదయం 11 గంటల నుండి వరదలకు వర్షాలకు దెబ్బ తిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాం తాలను హెలికాఫ్టర్ నుండి పరిశీలించారు. తదుపరి రోడ్డు మార్గం లో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు.అనంతరం కొల్లేరు, ఉప్పు టేరు, తమ్మి లేరు వరదలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.
