సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, శనివారం స్థానిక డి యాన్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నేడు సెప్టెంబర్ 14 తేదీన ఇంజనీర్స్ డే పురస్కరించుకుని వేడుకలను కళాశాల ఘనంగా నిర్వహించారు.ఈ కార్యాక్రములో ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి చిత్ర పటంకు కళాశాల అద్యక్షులు జి .వి .నరసింహరాజు , కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) ,ముఖ్య అతిధి శ్రీ పీర్ అహ్మద్ ఖాన్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, APEPDCL పూల దండ వేసి ఈ కార్యాక్రము ఘనంగా ప్రారంభించారు వక్తలు మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు అపర భగీరథుడు అని , భావితరాలకు ఆదర్శనీయుడని,ఒక గొప్ప ఇండియన్ సివిల్ ఇంజనీర్ అని ,ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందిని అన్నారు.ఇంజినీరింగ్ రంగంలో దేశంలో అపూర్వమైన నిర్మాణాలు చెప్పటి ఆయన చేసిన సేవలు అమోఘం అని . దీంతో పాటు విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన్ను “వి.ఎం సర్” అని కూడా పిలుస్తారు అని అన్నారు ఆధునిక భారతదేశంలో ఆనకట్టలు, రిజర్వాయర్లు, హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప ఇంజినీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పేర్కొన్నారు. .అనంతరం పీర్ అహ్మద్ ఖాన్ ని ఘనంగా సత్కరించారు .ఈ సందర్బంగా కలశాలలో నిర్వహించిన ఇంజనీర్ల దినోత్సవ చిత్ర లేఖన పోటిలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు.
