సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ లో వరద బాధితులకోసం సీఎం రిలీఫ్ పండ్ కోసం భీమవరం నుండి దాతలందిస్తున్న సహకారం అద్వితీయమని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. నేడు, ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో వరద బాధితులకు సహాయార్ధం పలువురు దాతలు సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. చింతలపాటి రాజంరాజు (రాజబాబు) రూ 2 లక్షలు, విశాఖపట్నంకు చెందిన కలిదిండి నరసింహరాజు రూ 1 లక్ష విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబు కు అందించారు.ఆర్య సిపుడ్స్ రూ 2 లక్షల చెక్కునుజనసేన పార్టీ రాయలం -1 ఉపాధ్యక్షులు యర్రంశెట్టి శివకృష్ణ రూ 25 వేలు, ఎమ్మెల్యే అంజిబాబుకుఅందించారు.దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.
