సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: :పులివెందులలో మెడికల్ కాలేజీకి సీట్లు కేటాయించనక్కర లేదని ,కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం..? అలాగే ప్రభుత్వమెడికల్ కాలజీలను ప్రెవేటు పరం చెయ్యాలన్న ప్రభుత్వం ప్రయత్నాలు ఫై నేడు, ఆదివారం మాజీ సీఎం జగన్ x వేదికగా సీఎం చంద్రబాబు ఫై పలు ప్రశ్నలు ఎక్కుపెట్టారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైర్గ న పాలనచేస్తోందన్నారు పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితులల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లనుట్ల తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా నా ప్రభుత్వ హయాంలో కట్టించిన మెడికల్ కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరుదాటాక తెప్పతగలేయడం కాదంటారా?ప్రభుత్వ సంస్థలంస్థ లంటే అంత అసహ్యమెందుకు?: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023-24 సంవత్సరాల్లో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రా నికి రాలేదంటారా? చాలామంది పేద పిల్లలుల్ల సీట్లు సాధించి డాక్టర్క్ట చదువులు చదవడం లేదా? ఈ ఏడాదిలోనే మరో 5 కాలేజీలు మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. అనేక మంది విద్యార్థులు డాక్టర్లయ్యే ర్ల అవకాశం ఉండేది. ఇప్పుడుపాడేరు కాలేజీని 50 సీట్లకేట్ల పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే,వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్ కాలజీలను ప్రెవేటు పరం చెయ్యడం ఏమిటి? దీనిని రాష్ట్రంలో విద్యార్థులు గమనించాలని అని జగన్ ప్రశ్నించారు.
