సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఈ నెల 19న కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 18న జరిగే రాష్ట్ర మంత్రి వర్గ క్యాబినెట్ భేటీలో కొత్త మద్యం పాలసీపై చర్చించనున్నారు. అనంతరం నూతన మద్యం పాలసీపై నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కొత్త లిక్కర్ పాలసీని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించి ఆన్ లైన్ లో లాటరీ ద్వారా షాపుల లైసెన్సులు జారీ చేయనుంది ప్రభుత్వం. వైసీపీ హయాంలో మద్యం షాపులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవగా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే అవకాశం ఉంది. అటు ఇప్పటికే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఇప్పటికే దశలవారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు సీఎం చంద్రబాబు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీపై ఏపీ అధికారులు అధ్యయనం చేసారు.
