సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కరోనా సమయం లో దేశం విలవిలా లాడుతుంటే ఒక్కసారిగా పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. దానితో అన్ని ధరలు పెరిగి కాస్త 4 నెలలు క్రితం ఎనికలకు ముందు కాస్త దిగివచ్చాయి. అలా ఎన్నికలు ముగిసాయి. ఇక చూస్కోండి.. ప్రస్తుతం ఏపీలో గత 4 నెలలుగా ఆకాశమే హద్దుగా నిత్యావసర సరకులు ధరలు, బియ్యం వంటనూనెలు పెరగటమే తప్ప దిగి రావడం జరగటం లేదు. ఉల్లిపాయలు ధరలు కేజీ 70 రూపాయలు ఎగబాకాయి. గోధుమలు బియ్యం ధరలు మరో 15 -20శాతం ధరలు అదనంగా పెరిగాయి. ఆకూ కూరలు 50 శాతం ధరలు పెరిగాయి. ఇక వంట నూనెలు ఇంకా పెరగలేదు అనుకొంటున్న సామాన్యుడు ..తాజగా వాటి పెరుగుదల కూడా ఒక్క సారిగా పెరిగిపోవడంతో చుక్కలు చుక్కలువిలవిలాడుతున్నాడు. గత శనివారం నుంచి వంటనూనె లీటరు ధర రూ.20ల వరకు పెరిగింది. పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనె, సోయానూనె ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించిన ఆ మరుక్షణమే రిటైల్ వినియోగదారులు లీటరుకు రూ.20 పెంచేశారు. దిగుమతి సుంకానికి అదనంగా 5శాతం స్టాండెడ్ సెస్, 10శాతం అగ్రికల్చర్ సెస్ యాడ్ అవుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.112 నుంచి 125 – 130 వరకు పెరిగింది. చిల్లర దుకాణాల్లో ఇంకో ఐదు రూపాయలు ఎక్కువగానే అమ్ముతున్నారు. పామాయిల్ ధర రూ.95 – 110కు పెరిగింది. వేరుశనగ రూ.165 నుంచి రూ.175కు పెరిగింది.. సన్‌ఫ్లవర్ 15 కేజీల టిన్ రూ.1,750 నుంచి రూ.2వేలకు ఎగబాకింది. పామాయిల్ డబ్బా రూ.1,520 నుంచి 1,720కు పెరిగింది. రైస్‌బ్రాన్ ఆయిల్ రూ.110 – 130కి పెరిగింది. ఒక్కసారిగా ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
