సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు .. భీమవరం అంబేద్కర్ చౌక్ నందు నేడు, మంగళవారం ఉదయం స్వచ్ఛత హీ సేవ 2024 ( స్వచ్ఛత భాగిదారి) కార్యక్రమంలో భాగంగా మానవ హారం & స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు నరసాపురం లోక్ సభ సభ్యులు మరియు కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ , స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘరామ కృష్ణంరాజు, టీడీపీ రాష్ట్ర నేత మెంటే పార్ధ సారధి పాల్గొని .. ప్రజలు తమ ఇంటితో పాటు అవసరమైతే మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకొని అందరి ఆరోగ్యాలను పరిరక్షించాలని తద్వారా దేశ అభివృద్ధి కి దేశ సేవలో పాల్గొని నట్లే అని వక్తలు పేర్కొండమే కాదు స్వయంగా చీపురులు చేత బట్టి అంబెడ్కర్ విగ్రహం నుండి రైల్వే అండర్ టర్నల్ వైపు గ రోడ్డులు శుభ్రం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ C. నాగమణి జిల్లా, జాయింట్ కలెక్టర్ T. రాహుల్ కుమార్ రెడ్డి మరియు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, పట్టణ పోలీస్ అధికారులు భీమవరం మున్సిపల్ కమిషనర్, రామచంద్ర రెడ్డి మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *