సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బోఫోర్స్, 2 జి సెక్త్రం వంటి భారీ కుంభకోణాలను వెలికి తీసి దేశంలో ప్రకంపనలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కడిగిపారేసిన ఉద్దండుడు.. నాయ్యవాది ,నిలువెత్తు హైందవ వాదీ , బీజేపీ అగ్రనేత, మాజీ ఎంపీ :సుబ్రమణ్య స్వామి తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. నేడు, సోమవారం ఎక్స్ వేదికగా తిరుమల లడ్డు వివాదం ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ప్రసాదం కలుషితమైందన్న ఆయన వ్యాఖ్యలు భక్తుల్లో ఆందోళన రేకెత్తించాయి.ఇది పవిత్ర లడ్డు ప్రతిష్టను దెబ్బ తీస్తుందని కాబ్బటి ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్ట్ ను అభ్యర్థిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను లేఖ విడుదల చేసారు.
