సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలువురి మోటారు బైకు లను చోరీ చేసిన కేసుల్లో గణపవరం మండలం ముగ్గుళ్ళ గ్రామానికి చెందిన శెట్టి చిన్న(33) ను (మరియు కొయ్యలగూడెం మండలం చొప్పరామన్నగూడెం గ్రామానికి చెందిన చప్పిడి ముసలయ్య అలియాస్‌ కేసీఆర్‌ అనే వ్యక్తితో కలసి ఉమ్మడిగా దొంగతనాలు) జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిడమర్రు సీఐ సుభాష్‌, సీఐ రాజశేఖర్‌, గణపవరం ఎస్‌ఐ మణికుమార్‌ వారి సిబ్బంది నిఘా ఏర్పాటు చేసి శెట్టి చిన్నాను అరెస్టు చేశారు. అతని నుంచి 22 లక్షల రూపాయల విలువైన 29 మోటారు సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మోటారు సైకిళ్ళల్లో 15 మోటారు సైకిళ్ళు వివిధ కేసుల్లోజిల్లాలో వివిధ పోలీస్‌ స్టేషన్‌ల లో నమోదు అయ్యాయని, మిగిలిన 14 మోటారు సైకిళ్ళ వివరాలు తెలియాల్సి ఉందన్నారు.ఇంకా చప్పిడి ముసలయ్యను అరెస్టు చేయాల్సి ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *