సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తూ నేతలకు చంద్రబాబు సర్కార్.. గుడ్‌న్యూస్ చెబుతూ వివిధ నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసింది. తాజగా..వివిధ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. కాగా 20 పోస్ట్ లలో టీడీపీ – 16, జనసేన -3, బీజేపీ – 1 చొప్పున ఛైర్మన్ పదవులను కేటాయించారు. పశ్చిమ గోదావరి నేతలకు ప్రాధాన్యం దక్కింది. వీటిలో కీలకమైన ఏపీఐఐసీ కార్పొరేషన్ కు ఉండి మాజీ ఎమ్మెల్యే – మంతెన రామరాజు ను ,ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ – పీతల సుజాత ను పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ – నందం అబద్దయ్య ను, లిడ్ క్యాప్ – పిల్లి మాణిక్యాల రావును,హౌసింగ్ బోర్డు – బత్తుల తాతయ్య బాబును ,వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజీజ్ ను, విత్తనాభివృద్ధి సంస్థ – మన్నె సుబ్బారెడ్డి ను, 20 సూత్రాల అమలు – లంకా దినకర్ (బీజేపీ)ను ఏపీ టిడ్కో – వెనుములపాటి అజేయ్ కుమార్ (జనసేన) ను చైర్మెన్ లుగా నియమించారు.
