సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై భూమి ఫై నుండి ఇద్దరు చంద్రులను చూసే అవకాశం ప్రజలకు కలగబోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే 2024 పీటీ5 ఆస్టరాయిడ్ కొన్నేళ్లుగా భూమికి దగ్గరగా జరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంలో ఉన్న ఈ గ్రహశకలం మెల్లగా భూమి ప్రభావం పరిధిలోకి కూడా రావడంతో మినీ ఉపగ్రహంగా మారింది. సూర్యుడు, భూమి గురత్వాకర్షణ శక్తి సంయుక్త ప్రభావంతో ఈ అద్భుతం సాక్షాత్కారమైంది. కొన్ని రోజుల పాటు ఈ మినీ మూన్ సంక్లిష్టమార్గంలో భూమి చుట్టూ పరిభ్రమించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నవంబర్ తరువాత మళ్లీ తన పాత మార్గంలో ప్రయాణించనుందని అన్నారు.
