సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజ్యసభలో ఒక్క ఎంపీ స్థానం కూడా లేని టీడీపీ కి మేలు జరిగే విధంగా త్వరలో ఏపీలో రాజ్య సభ ఎన్నికలు జరిగే విధముగా ప్యూహాత్మకంగా పావులు కదులుతున్నాయి. దీనిలో భాగంగా పరోక్షంగా టీడీపీ, BJP కి మేలు కలిగే విధంగా… ఇప్పటికే కేంద్రంలో బిల్లు లు పాస్ కావడంలో నిర్ణయాత్మక శక్తిగా 11 రాజ్యసభ ఎంపీలతో బలంగా ఉన్న వైసీపీ లో ఇద్దరు ఎంపీలు రాజీనామాలు చెయ్యగా ఇప్పుడు తెలంగాణ నుండి ఏరికోరి తెచ్చుకున్న జాతీయ స్థాయి బిసి నేత ఆర్ క్రిష్నయ్య కూడా హ్యాండిచ్చారు. నిన్నటి వరకు జగన్ సాహసోపేతంగా BCలకు ఇచ్చిన ప్రాధాన్యం మరచిపోను.నా జీవితంలో ఇంత గౌరవం ఇచ్చిన ఆయనకు నమ్మక ద్రోహం చెయ్యను. ఒక వేళా ఆలా చేస్తే అది కళంకం అని ప్రకటించిన ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్కు అందజేశారు. ఈ రాజీనామాకు రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ కూడా ఆమోదం తెలిపారు. దీంతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 8 కి పడిపోయింది. ఇటీవలే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేశారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా వీరి సరసన చేరారు. ఆర్ క్రిష్ణయ్య కు బీజేపీ కీలక పదవి ఆఫర్ చేసినట్లు భావిస్తున్నారు.
