సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ ఆదేశాల మేరకు.. సనాతన ధర్మానికి హాని జరిగితే మౌనంగా ఉండటం మంచిది కాదని, సనాతన ధర్మాన్ని రక్షించుకుని తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుఅన్నారు. నేడు, బుధవారం ఉదయం భీమవరం జెపి రోడ్డులోని శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలను నిర్వహించి వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు ఎమ్మెల్యే అంజిబాబు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై హిందువులందరూ కలిసికట్టుగా మాట్లాడాలని, తిరుమల తిరుపతి లడ్డు హిందువుల మనోభావాలను డెబ్బతిసిందని, ప్రాయశ్చత దీక్షలో భాగంగా ఈనెల 30న సాయంత్రం అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించడం, అక్టోబరు 1న ప్రతి ఒక్కరూ ’’ఓం నమో నారాయణాయ’’ అనే మంత్రాన్ని సామూహికంగా ఆలయాలు, 2న నగర సంకీర్తన, 3న ఆలయాల్లో భజన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
