సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు వేడుకలు వచ్చేనెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీ మావుళ్ళమ్మవారి.. దేవి శరన్నవరాత్రి మహోత్సవ పోస్టర్, బ్రోచర్, పుస్తకాలను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఆలయ ఈవో, సహాయ కమిషనర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ.. వచ్చే నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సావాలు నిర్వహిస్తున్నామని, 14వ తేదీన భారీ అన్నసమారాధన తో వేడుకలు ముగుస్తాయని అన్నారు. శ్రీ అమ్మవారికి 3న శ్రీసువర్ణ రజిత కవచాలంకరణ, 4న బాల త్రిపురసుందరీ దేవి, 5న గాయత్రి దేవి, 6న అన్నపూర్ణ దేవి, 7న మహాలక్ష్మి దేవి, 8న లలితా త్రిపుర సుందరీ దేవి, 9న సరస్వతి దేవి, 10న దుర్గాదేవి, 11న మహిషాసుర మర్ధినిదేవి, 12న రాజ రాజేశ్వరి దేవి అలంకరణ చేస్తామని, 12న గ్రామోత్సవం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు, ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ, ఆలయ మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణ మూర్తి, పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, చల్లా రాము, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
