సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ , కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ నేడు,. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ దిగజారిందన్నారు. గతంలో ఏడు కొండలను రెండు కొండలు చేద్దామనుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. హిందు ధర్మం ప్రకారం దంపతులు పట్టు వస్త్రాలు ఇచ్చేవారని.. కానీ జగన్ ఒక్కరే ధర్మానికి వీరుద్ధంగా పట్టు వస్త్రాలు ఇచ్చారని తెలిపారు. అన్య మతస్తులకు డిక్లరేషన్ ఇవ్వాలన్నది చాలా సంవత్సరాలుగా ఉన్న నిబంధన అని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి వెళ్లారన్నారు. లడ్డూ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మింది మందితో సిట్ ఏర్పాటు చేశారని.అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో తాజగా 4వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం దానిపై కార్మిక సంఘాలు పోరాటానికి దిగటం ఫై స్వాందింస్తు .. స్టీల్ ప్లాంట్ విషయంలో కొత్త ప్రక్రియ ఏమి లేదని స్పష్టం చేశారు. 2014 ముందు ఉన్న ప్రభుత్వం నిర్ణయాలపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుందన్నారు. ఉద్యోగుల భద్రత,సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితులు పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం పని చేస్తున్నామని తెలిపారు.విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రజల సెంటిమెట్లను నిలబెట్టేలా ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు
