సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు, ఆదివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సెలవు దినం కూడా కావడంతో ఎంతో దూరప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా విశేషంగా హాజరు అయ్యి శ్రీ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. దేవాలయ ఆవరణలో నేటి ఉదయం కుంకుమ పూజలు, చండి హోమం, శ్రీ విష్ణు పారాయణ పఠనం నిర్వహించారు. నేటి మధ్యాహ్నం ఆలయ పందిరిలో వేదికపై భజన, లలితా సంగీత కచేరి,నిర్వహిస్తున్నారు. నేటి సాయంత్రం 6 గంటలకు ఆధ్యాత్మిక ప్రవచనాలు మరియు రాత్రి 7 గంటలకు అభినయ విజయవాడ వారిచే కూచిపూడి నృత్యం నిర్వహిస్తారు, అందమైన లైటింగ్ అలంకరణలు భారీ పందిళ్ళలో ఆధ్యాత్మిక కార్యక్రమాల వీక్షణం ఆహుతులను అలరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *