సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 4 నెలలుగా దేశవ్యాప్తంగా నిత్యావసర సరకుల ధరలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు అనూహ్యంగా పెరిగిపోయి ఇక దిగి రాను అనడంతో పేదలు మధ్యతరగతి వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ప్రభుత్వ పెద్దలు అయితే.. రైతు బజారులో తగ్గించాం.. ఇక కొద్దీ రోజులు ఆగండి .రిటైల్ మార్కెట్లో కూడా తగ్గిస్తాం అంటున్నారే తప్ప.. ఒక నాలుగు రోజులు తగ్గించిన తిరిగి యదా స్థాయి రేట్లు పెరిగిపోవడంతో కారణాలు తెలియక ఉన్నంత సర్దుకుపోతూనే ఉన్నారు ప్రజలు. ఒక ప్రక్క దసరా రోజులు మరో ప్రక్క కార్తీక మాసం వచ్చేస్తుంది.. స్వామి మాలలు.. ఇక దాదాపు అందరూ శాఖాహారులుగా మారిపోతున్నారు. కూరగాయల వినియోగం మరింత పెరిగింది. ఇక మరో 70రోజులు వరకు కూరగాయలు ధరలు, ఆకూ కూరలు ఇంకా పెరగటమే తప్ప తగ్గేదే లేదు..ఇప్పుడు ఈ కాలంలో ఇంత ధర పలకని ఉల్లి కేజీకి రూ.70కి చేరువలో, టమాటా యలు కేజీ కి 50- 100 రూ పైబడే ఉంటున్నాయి . ఒక్క అల్లం ధర మాత్రమే 200 నుండి 100 రూపాయలకు దిగివచ్చింది.. ఇక దాదాపు అన్ని కూరగాయలు 50 నుండి 100 రూపాయలకు ఫై మాటగానే ఉంటున్నాయి
