సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని అన్ని దేవి ఆలయాలలో , మరియు ఆర్యవైశ్య, జైన్స్ , బెంగాల్ స్వర్ణ కార్ల సంఘాలు వంటి సంస్థల ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి ప్రతిమలను నిలబెట్టి అంగరంగ వైభవంగా దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. అలాగే భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు నేడు, సోమవారం దసరా 5వ రోజు వేడుకలలో భాగంగా సకల భాగ్యాలు కలిగించే ‘మహాలక్ష్మి’ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
