సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్కినేని నాగచైతన్య సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు వెయ్యడానికి అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు ఈనేపథ్యంలో కోర్టుకు స్టేట్ మెంట్ ఇవ్వడానికి సినీ హీరో నాగార్జునతో పాటు భార్య అమల, కుమారుడు నాగ చైతన్య, సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు, శుశాంత్ తల్లి, నాగార్జున సోదరి నాగసుశీల నాంపల్లి కోర్టుకు స్వయంగా నేటి మంగళవారం మధ్యాహ్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టుకు నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్ లో ‘‘సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి.. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయి.. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి.. సినిమా రంగంతో పాటు సామజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడం వలన ఆ వార్తలు దేశవ్యాప్తంగా మీడియాలో ప్రసారం అయ్యి మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆమె మాటలు అన్ని కూడా అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశ్యంతోనే మంత్రి ఇలాంటి వాఖ్యలు చేసింది.. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. అంటూ కోర్టుకు నాగార్జున స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *