సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణం గా దేశీయ స్టాక్ మార్కెట్‌లోఇటీవల వరుస నష్టాలకు.. నేడు మంగళవారం బ్రేక్ పడింది. నేడు, మంగళవారం ఉదయం కూడా ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం లాభాల్లోకి దూసుకొచ్చింది. ఇక ముగింపులో సెన్సె క్స్ 584 పాయింట్లు లాభపడి 81,634 దగ్గర ముగియగా.. నిఫ్టీ 217 పాయింట్లు లాభపడి 25, 013 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.96 స్థిరం గా ముగిసింది. నిఫ్టీలో అద్దె, అదానీ ఎం టర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎం అండ్ ఎం లాభాల్లో కొనసాగగా.. టాటా స్టీల్,ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ నష్టపోయాయి. మెటల్ మినహా ఇతర అన్ని రంగాల సూచీలు లాభాలలో ముగిసాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *