సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నరసాపురం నడుమ ప్రజలకు వినోదం పాటు ఎన్నో విషాదాలు మిగిల్చిన పేరు పాలెం సముద్ర తీరం దసరా సెలవుల నేపథ్యంలో యాత్రికులతో కాస్త ఉల్లాసం కోసం సేద తీరడానికి పర్యాటకులతో కోలాహలంగా ఉంది. ఇంతలో ముగ్గురు వ్యక్తులు సినీ పక్కీలో తమ అతి తెలివికి పని పెట్టారు. తాము పోలీసులమని నమ్మించి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ విహారానికి వచ్చిన పలువురిని అరెస్ట్ చేస్తామని వేధిస్తూ డబ్బులు గుంజే పనిలో పడ్డారు. దీనితో కొందరికి వారి తీరుపై అనుమానం వచ్చి అసలు పోలీసులకు తెలియజెయ్యగా వారు వచ్చి ఆ ముగ్గురు డూప్లికేట్ పోలీసులను అదుపులోకి తీసుకోని నేడు, శనివారం ఉదయం మొగళ్తూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు వారిని విచారించి, గతంలో వారి మోసాలు.. దోపిడీ సొమ్ము రాబట్టే పనిలో ఉన్నట్లు తాజా సమాచారం. ..
