సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. నేడు, బుధవారం వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ 37 లక్షలతో 7 సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే అంజిబాబు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మత్స్యపురి పంచాయతీ కార్యాలయం వద్ద రూ 5 లక్షలతో 650 మీటర్ల సీసీ రోడ్డు, పోస్ట్ ఆఫీస్ నుంచి బంధుల పేతురు ఇంటి వరకు రూ 3 లక్షలతో 40 మీటర్ల సీసీ రోడ్డు, పశువుల ఆసుపత్రి నుంచి చౌదుల హరీష్ ఇంటి వరకు రూ 6 లక్షలతో 75 మీటర్ల సీసీ రోడ్డు, ఆర్ అండ్ బి రోడ్డు నుంచి చౌదుల వినాయక ఇంటి వరకు రూ 3 లక్షలతో 35 మీటర్ల సీసీ రోడ్డు, గణేశుల రామాంజనేయులు ఇంటి నుంచి దైవాల శ్రీరాముల ఇంటి వరకు రూ 10 లక్షలతో 131 మీటర్ల సీసీ రోడ్డు, చౌధుల రత్తయ్య ఇంటి నుంచి పిప్పల్ల నాగేశ్వర్రావు ఇంటి వరకు రూ 5 లక్షలతో 60 మీటర్ల సీసీ రోడ్డు, జల్లి నాగేశ్వర్రావు ఇంటి నుంచి జి ఆనంద రాజు ఇంటి వరకు రూ 5 లక్షలతో 70 మీటర్ల సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేసారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన పనులన్నింటినీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు కార్యక్రమంలో ఎంపిపి దుర్గాభవాని, విజయలక్ష్మి, సర్పంచ్ శాంతిప్రియ, వీరవల్లి చంద్రశేఖర్, వీరవల్లి శ్రీను, పిప్పళ్ల నాని, కారుమూరి సత్యనారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
