సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుస వాయుగుండాలతో కాస్త సేద తీరిన ఏపీ ప్రజలకు వచ్చే 3 రోజులలో తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర ఒడిశా తీరప్రాంతంలో ఉన్న ఉపరతల ఆవర్తనం నేడు. ఆదివారం కోస్తా, ఒడిస్సా తీరప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు విస్తరించి.. ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశగా వంగి ఉంటోంది. దీంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజులుఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
