సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఇటీవల పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నేడు, సోమవారము (ది.28-10-2024 తేదీన) ఉదయం 11 గంటలకు భీమవరం పట్టణం నందు గల స్థానిక టౌన్ హాల్ నందు పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ, అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్.,ఆధ్వర్యంలో “రక్త దాన శిబిరం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్స్ పాల్గొని రక్త దానం చెయ్యడం జరిగింది. వారిని ఎస్పీ అభినందించి పోలీసులు అంటే విధినిర్వహణలో క్రమ శిక్షణ తో పాటు ప్రజా రక్షణ లో మానవత్వం స్నేహ భావంతో మెలిగి ప్రజలుకు తమ రక్షకుడు అనే గౌరవభావం కలిగేలా ప్రవర్తించాలని అన్నారు.
