సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని దుర్గ మాత భక్తులకు అత్యంత మహిమానీత పుణ్యక్షేత్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేడు, ఆదివారం ఉదయం నుండి గాజుల మహోత్సవం ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఏట నిర్వహించే గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారిని గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.వర్ణమాల రంగులతో కూడిన అందమైన గాజులతో ఆలయం మొత్తాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ రకాల గాజులతో ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు, ఉప ఆలయాలు, అమ్మవారి మూలవిరాట్ అను గాజులతో సుందరంగా అలంకరించారు. వారాంతపు సెలవులకు తోడు కార్తీక మాసం ప్రారంభం, అమ్మవారు గాజుల అలంకరణలో ఉండడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.ప్రస్తుతం ఇంద్రకీలాద్రి వద్ద క్యూలైన్ లు పూర్తిగా నిండి ఉండే అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు కారులు రావడంతో కొండపై వాహనాలు బారులు తిని ఉన్నాయి.( ఫై చిత్రంలో ప్రధాన ఆలయంలో గోడలకు సైతం అలంకరించిన గాజులు దండలు చూడవచ్చు)..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *