సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్న దీపావళి కి బైక్ మీద ఉల్లిపాయల టపాసులు తీసుకొనివెళుతున్న మూట పేలిపోయి ఒక వ్యక్తి చనిపోవడం తో పాటు మరో 6గురు తీవ్రంగా గాయపడివారిలో ఇంకా ముగ్గురు చావుబ్రతుకుల మధ్య హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే నేడు, ఆదివారం ఉదయం ఒకపులివెందుల నియోజకవర్గం వేంపల్లి సమీపంలోని ఎస్ఎన్ఆర్ కళ్యాణమండపం వద్ద .అనంతపురం నుంచి లక్కిరెడ్డిపల్లికి వెళ్తున్న వందలాది గ్యాస్ సిలెండర్లు తో వెళుతున్న హెచ్ పీ గ్యాస్ సిలిండర్ లారీ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా బోల్తా కొట్టేసి ఏకంగా మొత్తం లారీ తిరగబడిపోయింది. కానీ విచిత్రంగాఏమి జరగలేదు.. ఒక బండ పేలడం మొదలయిన సరే ఆస్థి , ప్రాణ నష్టం లెక్కడటం కష్టంగా మారిపోయేది. ఏది ఏమైనప్పటికీ లారీ బోల్తా పడినప్పటికీ డ్రైవర్ కు చిన్నపాటి గాయాలు అయ్యాయి.గ్యాస్ లీక్ అయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదేమో అని సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలు అంటున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలం వద్దకు పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *