సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని పవిత్ర పుణ్యక్షేత్రం గునుపూడి లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానంలో భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. మహిళలు విశేషంగా దీపారాధన చేస్తున్నారు. నేటి బుధవారం సాయంత్రం స్వామి వారి అలంకారం ఫై చిత్రంలో చూడవచ్చు.. ఇక కార్తీకమాసోత్సవములు 5వ రోజు సందర్భముగా సేవలు నిమిత్తం రూ.7,166/-లు, దర్శనం వలన రూ.7,000/-, లడ్డు ప్రసాదం వలన రూ.2,220/-లు, కానుకలు/సమర్పణల ద్వారా రూ.200/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.15,567/-లు మొత్తం రూ.32,153/-లు ఆధాయం రాగా ఈ రోజు 1,500 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయుట జరిగినది. అంతకు ముందు 4వ రోజు సందర్భముగా సేవలు నిమిత్తం రూ.4,616/-లు, దర్శనం వలన రూ.3,500/-, లడ్డు ప్రసాదం వలన రూ.1,875/-/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.13,315/-లు శాశ్వత అన్నదానం నిమిత్తం రూ.10,000/-లు మెత్తం రూ.33,306/-లు ఆధాయం రాగా ఈ రోజు 2,500 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశామని దేవాలయ ఇఓ, డి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు
