సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పవిత్ర పంచా రామంలో కార్తీక మాసోత్సవాలకు వేలాదిగా తెలుగు రాష్ట్రాల నుండి ఉత్తరాది నుండి కూడా భక్తులు తరలి వస్తున్నా నేపథ్యంలో గునుపూడి ప్రాంతాలలో పరిశుభ్రత, పారిశుద్యం ఫై మునిసిపల్ కమీషనర్ కె.రామచంద్రా రెడ్డి ప్రత్యక శ్రద్ద పెట్టారు. ఆయనే స్వయంగా అక్కడి పారిశుధ్య కార్యక్రమాలను రోజు విడిచి రోజు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారు జామున వచ్చి అక్కడ రోడ్డులు ఫై చెత్త ఊడిచే పారిశుధ్య కార్మికులతో మున్సిపల్ కమిషనర్ కూడా ఒక చీపురు వేసిన దృశ్యం ఫై చిత్రంలో చూడవచ్చు.. దేవాలయాలలో మనం దేవుడిని ఎలా కొలుస్తామో అలానే ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోద్యం ప్రణంగా పెట్టె పారిశుధ్య కార్మికులు దేవుడికి ఏ మాత్రం తీసిపోరు.. వారిని గౌరవించడం మనందరి కర్తవ్యం..
