సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీలో శాసనసభ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి, శాసనసభ భేటీ అవుతాయి. ఈ మేరకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరుతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గడువు ముగియనున నేపథ్యంలో సమావేశాల మొదటి రోజే 11వ తేదీన 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలో స్పీకర్‌ అయన్నపాత్రుడి అధ్యక్షతన జరిగే సభా వ్యవహారాల సలహా మండలి(బీఏసీ)లో నిర్ణయం తీసుకుంటారు. 11 రోజులపాటుజరిగే వీలుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి సమావేశాలకుఈసారి వైసీపీ హాజరవుతుందా లేదా ? తెలియదు. ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు తో సదస్సును ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *