సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా ఐకాన్ అల్లు అర్జున్ పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌కి పాట్నా వేదిక అయింది.నిన్నటి సాయంత్రం నుంచే పాట్నాలో పుష్ప సందడి మొదలైంది. బన్నీకి నార్త్‌లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో పుష్ప కు ఒక్క పాట్నాలోనే ఎన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారో ఈ వేడుక రుజువు చేసింది. ఈ పంక్షన్ కు ఏకంగా 1200 మంది సెక్యూరిటీ. బీహార్ చరిత్రలోనే ఇంతమంది సెక్యూరిటీ మొదటిసారి. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు బీహార్ ప్రభుత్వం భారీ స్థాయిలో భారీ స్థాయిలో సహకారం అందించడం మరో విశేషం.. అల్లు అర్జున్ హిందీ స్పీచ్ తక్కువ మాట్లాడినా ఎక్కువగ అకట్టుకొంది .దర్శకుడు సుకుమార్ మాత్రం రాలేదు.. ఇక ట్రైలర్ చుస్తే సినీ అభిమానుల కు మతే తప్పిపోతోంది. ప్రతి సీను అద్భుతమే.. ప్రతి డైలాగ్ లోను .. ప్రతి ఫైట్ లోను పుష్ప బ్రాండ్ కసి కనపడుతుంది. టాక్ ఎలా ఉన్న 1000 కోట్లు కలెక్షన్స్ పక్క.. ఒకవేళ టాక్ కూడా బాగుంటే పుష్ప నేషనల్ కాదు ఇంటర్ నేషనల్ గా వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయం గ కనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూసి దర్శక ధీరుడు రాజమౌళి మొదలు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
